Local Elections: స్థానిక ఎన్నికలు రద్దవుతాయా?

Local Elections: స్థానిక ఎన్నికలు రద్దవుతాయా?

By :  ehatv
Update: 2025-09-30 10:46 GMT

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్‌ 9న రాబోతుంది. సో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు, రెండు విడతల్లో ఎంపిటీసి, జెడ్పిటీసి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. దానికి సంబంధించిన షెడ్యూల్ ని బయట పెట్టారు, అయితే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో, ఈ ఎన్నికలు ఉంటాయా, రద్దవుతాయా లాంటి చర్చ జరుగుతోంది, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో, ఎన్నికలకు సంబంధించిన డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత కూడా రద్దు అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే చర్చ, ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎన్నికల్ని రద్దు చేసే ప్రమాదం ఉంది. ఇలాంటి చర్చ తెలంగాణలో ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకు వస్తుంది ఈ చర్చ 50% రిజర్వేషన్లు దాటొద్దు అనేది సుప్రీం కోర్టు పెట్టిన స్లాబ్ ఉంది. సో 50% కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఉంటే. సుప్రీం కోర్టు కొట్టేసిన సందర్భాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే. బీహార్ విషయంలోనూ. మహారాష్ట్ర విషయంలోనూ చూస్తున్నాం. బీహార్ లో కూడా కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్. ఆరాష్ట్ర ప్రభుత్వమే పెంచుతూ జీఓ ఇచ్చి 63% రిజర్వేషన్లు చేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు వాటిని కొట్టేసింది. మహారాష్ట్రలో కూడా ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి. స్లాబ్ పెరగడంతో మహారాష్ట్రలో జరిగిన ఐదు జిల్లాల్లో స్థానిక ఎన్నికల్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. గుజరాత్లోనూ ఇదే తరహా అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో, కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తుంది. సో 423% బీసి రిజర్వేషన్లో కలిపితే తెలంగాణలో రిజర్వేషన్ల పర్సంటేజ్ 69 % శాతానికి పోయింది, సో 50% స్లాబ్ కంటే 19% ఎక్కువగా ఉంది. 50% స్లాబ్ దాటింది కాబట్టి వీటిని సుప్రీం కోర్టు కన్సిడర్ చేసే పరిస్థితి ఉండదు. కొట్టేసే అవకాశం ఉంది, ఇలాంటి చర్చ జరుగుతుంది నిజానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టులో కేసులు నేపథ్యంలో కోర్టు చెప్పింది సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలకు సంబంధించి, ఎన్నికలను నిర్వహించండి అంటూ కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న షెడ్యూల్ ని ఎన్నికలకి ఇనిషియేట్ చేసింది, షెడ్యూల్ నిన్న రిలీజ్ అయింది, సో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి 42% రిజర్వేషన్లు ఇవ్వబోతుంది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Full View

Tags:    

Similar News