Jagan's land title survey..! జగన్ ల్యాండ్‌ టైటిల్‌ సర్వేకు కేంద్రం కితాబు..!

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే, ఆ మాటక వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఈ పదం బాగా తెలుసు. ఎందుకంటే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, ఈ పదం చాలా పాపులర్ అయింది, ఈ పదాన్ని అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ, మహాకూటంకి సంబంధించిన నాయకులంతా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూములన్నిటిని దోచుకెళ్ళిపోతున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి భూమిలో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్న హద్దురాళ్లు పాతారు కాబట్టి, ఇక ఆ భూములన్నీ జగన్మోహన్ రెడ్డివే, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సంపదనంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కష్టాలతో కష్టంతో కట్టిన పన్నుల నుంచి, ఆ డబ్బులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు, ఇవన్నీ పేదవాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళని సోమరిపోతులుగా మారుస్తున్నాడు, సో వాళ్ళని సోమరిపోతులుగా మార్చడం కోసం, మళ్ళీ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం కోసం, ఇంకా అప్పులు తీసుకురావడానికి ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేసాడు, ఇంకా అప్పులు తీసుకురావడానికి ఏమీ లేదు కాబట్టి, ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తే, మీ భూములన్నీ, ఆల్రెడీ ఇప్పుడు ఆయన పేరు మీదకి వచ్చేసి, ఆయన బొమ్మలు పాతారు కాబట్టి, ఈ భూములని తాకట్టు పెట్టి తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్ లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తాడు, తస్మాత్ జాగ్రత్త, భూములు ఉన్నవాళ్ళు, ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దు, ఇది చాలా పెద్ద ఎత్తున జరిగిన క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలని మార్చేసిందా అంటే డెఫినెట్ గా కాదు, అని చెప్పలేం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు ఈ క్యాంపెయిన్ కు కచ్చితంగా లింక్ ఉంది, ఈ క్యాంపెయిన్ ఎన్నికల ఫలితాలని మార్చేసింది కూడా, ఆ క్యాంపెయిన్ అంతా శుద్ధ అబద్ధం అని నిన్న పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక సర్వే తేల్చేసింది, కేంద్ర ఆర్థిక సర్వే చెప్పిన మాట ప్రకారం బడ్జెట్ కంటే ముందు, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేని ప్రవేశపెడుతుంది, ఈ ఆర్థిక సర్వేలో భాగంగా ఆయా రాష్ట్రాలు సాధించిన అభివృద్ధి, ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన విధానాలు, ఆయా రాష్ట్రాల్లో కొత్తగా తమ ఇంప్లిమెంట్ చేసిన విధానాలు ఏంటి, ఏ ఏ రంగంలో, ఏ ఏ ప్రాంతం ఏ రాష్ట్రం, ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది అనే అంశానికి సంబంధించిన వివరాలన్నింటిని, ఆర్థిక సర్వేలో పొందుపరుస్తూ ఉంటారు, ఆర్థిక సర్వేని బేస్ చేసుకునే బడ్జెట్ అంచనాలు ఉంటాయి, బడ్జెట్లో ఏ ఏ పథకానికి, ఏ ప్రాంతానికి ఏ పర్టికులర్ సెక్టార్ కి ఎన్ని నిధులు ఇవ్వాలి అనేది, ఆర్థిక సర్వేని బేస్ చేసుకొనే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. దీనిలో భాగంగా విదేశీ పెట్టుబడ్లు రావాలన్నా, భారతదేశంలో భూములకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, చాలా కంపెనీలు భారతదేశానికి రావడానికి వెనకడుగు వేస్తాయి, ఇక్కడ భూములకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అని ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో, భూముల్ని డిజిటలైజ్ చేయండి అంటూ కేంద్ర ప్రభుత్వం గడిచిన కొన్ని కొన్నేళ్లుగా చెప్తూ వస్తుంది, దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ విధానాన్ని, ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలని భావించి, 2021 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ సర్వే కి శ్రీకారం చుట్టింది, ఈ ల్యాండ్ సర్వే చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వేయర్లు లేరు, 15,000 మంది ట్రైన్డ్ సర్వేయర్లను పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేశారు, అది ఆ ల్యాండ్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ, నేను దానిలోకి పోను కేంద్రం ఏం చెప్పిందో చెప్తా. ఈ సర్వే చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనతగా పార్లమెంట్ కు నిన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో..!



Updated On
ehatv

ehatv

Next Story