I-Bomma Ravi: మధ్య తరగతి దేవుడు ఐ-బొమ్మ రవి.. అతనికి ఇంత మద్దతా?

The middle class god, I-Bomma Ravi.. does he have so much support?

By :  ehatv
Update: 2025-11-17 10:02 GMT

Full Viewఐ బొమ్మ రవి అరెస్టుకి సంబంధించిన వార్తలు చాలా విస్తృతంగా చూస్తున్నాం. రెండు రోజుల నుంచి ఆయన అరెస్టుని ఒక సెలబ్రేషన్ మోడ్‌లో చేసుకుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ పోలీసులు కూడా తామ ఒక అచీవ్మెంట్ చేశమనే, హీరో వర్షిప్ లో పోలీస్ యంత్రాంగం అంతా కనబడుతుంది. ఐబొమ్మ రవి చేసింది డెఫినెట్ గా చట్ట వ్యతిరేకం, చట్ట విరుద్ధం, అలా చేసి ఉండకూడదు, పైరసీ పైన నిషేధం ఉంది. పైరసీ చేయడం నేరం, పైరసీకి వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేయొచ్చు. పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీకి శాపంగా మారుతుంది. సినిమా ఇండస్ట్రీ నష్టాల కారణం అవుతుంది, సినిమా ఇండస్ట్రీ మనుగడకే ప్రమాదంగా మారింది, నో డౌట్ పైరసీని అరికట్టాల్సిందే. పైరసీ ఎవరు చేసినా సహించాల్సిన అవసరం లేదు, అటువంటి పైరసీ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు, సమాజం చూస్తున్న కోణం ఆలోచింప చేసేలా ఉంది. సమాజం చూస్తున్న కోణాన్ని సినిమా ఇండస్ట్రీ కూడా చూడాల్సి ఉంది. సమాజం చూస్తున్న కోణాన్ని పోలీసులు కూడా చూడాల్సి ఉంది. సమాజం చూస్తున్న కోణాన్ని ప్రభుత్వాలు కూడా చూడాల్సి ఉంది. ఏంటి సమాజం చూస్తున్న కోణం నిన్నటి నుంచి సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి, సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనే దానిపై నాకు చాలా తక్కువగా అవగాహన ఉంటుంది. పెద్దగా నేను దానిపై పోను, కానీ ఈ రవి అరెస్ట్ కి సంబంధించిన వార్తలు విస్తృతంగా వస్తున్న తర్వాత, అదేంటో అని ఒకసారి చూస్తే, డిజిటల్ మీడియాలో ప్రధానంగా ఇమ్మడి రవికి విశేషంగా మద్దతు కనబడుతుంది. అతన్ని మధ్య తరగతి దేవుడు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడం చూస్తున్నాం. అనేక వందల మంది ఏమాత్రం సంకోచించకుండా ఇమ్మడి రవి చేసింది తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు పోలీస్ అధికారుల ట్విటర్ హ్యాండిల్ కింద కూడా వెళ్లి అతన్ని ఎందుకు సార్ అరెస్ట్ చేస్తారు, అతను చేసిన తప్పేంటి అతను చాలా మందికి మంచే చేసాడు తప్ప, తప్పేం చేయలేదు అని అని పోలీస్ అధికారులు, అరెస్ట్ చేసిన పోలీస్ అధికారుల ఎక్స్ హ్యాండిల్ లో కూడా వెళ్లి కామెంట్స్ పెట్టడం చూస్తున్నాం.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Tags:    

Similar News