కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోయారు.

కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోయారు. ఈ 19 మంది చనిపోయిన సందర్భంగా ప్రభుత్వాలు సహాయం చేస్తామని చెప్తుంటే, మీడియానేమో ఎవరు చనిపోయారు, ఎలా చనిపోయారు, వాళ్ళు ఎలా ట్రావెల్ చేశారు, ఇటువంటి వార్తలకు పరిమితం అవుతున్నాం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అంటూ రకరకాల కథనాలు చూస్తున్నాం. నిన్నటి వరకు బస్సు డ్రైవర్ వెంటనే దూకి పారిపోయాడు, ఆయన అలర్ట్ చేసి ఉంటే ఇంకా కొంతమంది బ్రతికే ఛాన్స్ ఉండేది లాంటి వార్తలు చూస్తున్నాం. దానికి సంబంధించిన పాసిబిలిటీ కూడా కనబడుతుంది. సేమ్ టైం ఆ బైక్ డ్రైవ్ చేస్తూ వస్తున్న వ్యక్తి నిర్లక్ష్యంగా ఉండడం కారణంగా, ఆ బైక్ కారణంగా మొత్తం బస్ అంతా కాలిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ బైక్ నడిపిన వ్యక్తి పైన కూడా విమర్శలు రావడం ఆ కారణంగానే, ఒక్క వ్యక్తి కారణంగా మొత్తం బస్సులో ఇంతమంది చనిపోవాల్సి వచ్చింది, ఇలాంటి వార్తలు కూడా చూస్తున్నాం. సో బస్సు నడిపిన వ్యక్తి తప్పా, బైక్ నడిపిన వ్యక్తి తప్పా, మొత్తం ఈ ఘటన జరగడానికి సర్కారు నడిపిన వాళ్ళ తప్పేం లేదా అనే చర్చ ఖచ్చితంగా అవసరం. ఈ బస్సుకు సంబంధించిన వైలేషన్స్ పైన నిన్న, ఈరోజు కొన్ని వార్తలు చూశాం.

బస్సు హైదరాబాద్ లో ఎంటర్ అయ్యే సందర్భానికి సంబంధించి, హైదరాబాద్ లో ఇటువంటి ట్రావెల్ బస్సులు ఎంటర్ అవ్వడానికి, ఒక టైం ఉంటుంది, ఆ టైం లిమిట్ ని క్రాస్ చేసి అనేక సందర్భాల్లో హైదరాబాద్ లో ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఓవర్ స్పీడ్ కారణంగా చలాన్స్ ఈ బస్ కి ఉండడం చూస్తున్నాం, 90 కిలోమీటర్ల గంటకుపైగా స్పీడ్ తో చిన్న రోడ్స్ లో కూడా ఈ బస్సు ట్రావెల్ చేసిన అంశానికి సంబంధించిన చలాన్స్ కూడా చూస్తున్నాం. సో ఇన్నిసార్లు ఇంత వైలేషన్ ఈ బస్సు నిబంధనలు బస్ సిటీ లోపలికి వచ్చే అంశానికి సంబంధించి, హై స్పీడ్ కి సంబంధించిన నిబంధనలు వైలేట్ చేసింది. వైలేషన్ చేస్తుందని కేవలం చలాన్లు వేసి వదిలేశారు, రోడ్ పైన, బైక్ పైన వెళ్తున్న వాళ్ళకి మాత్రం ఆ మాట అనొచ్చో, లేదో కానీ దొంగల తరహాలో ట్రాఫిక్ పోలీసులు, రోడ్లపైన ఆపి బైకులు నడుపుతున్న వాళ్ళని, కార్లు నడుపుతున్న వాళ్ళని, జనాలను చూపించి అక్కడ ఓ దొంగల తరహాలో వాళ్ళని ట్రీట్ చేస్తూ అక్కడ డబ్బులు వసూలు చేయడం చూస్తుంటాం.

అవి ప్రభుత్వ ఖజానాకే వెళ్తాయి కావచ్చు కానీ, బైకులు, కార్లు ఓన్ డ్రైవింగ్ తో హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న వాళ్ళ పట్ల ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా సందర్భాల్లో చూస్తుంటాం. మరి ట్రావెల్ బస్సుల సంగతి ఏంటి వాటిని ఎవరు చూడాలి. చలాన్ల విషయం పక్కన పెట్టండి అసలు ఏమాత్రం పర్మిషన్స్ లేకుండా, పర్మిషన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా బస్సులు అలాగే నెలల తరబడి, తిరుగుతుంటే పట్టించుకోవాల్సింది. ఎవరు చూడాల్సింది, ఎవరు చూడండి, వాళ్ళ నిర్లక్ష్యం ఎందుకు కారణం కాదు, దీనికి ఆ బస్సు డోర్ ఓపెన్ కాకపోవడం వెనక రీజన్ ఏంటి, బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయలేని పరిస్థితి ఎందుకు ఉంది. రెండు ఎమర్జెన్సీ డోర్స్ ఉండాల్సి ఉంది, ఆ రెండు ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ కాలేదు అనేది కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న మాట. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On 25 Oct 2025 10:00 AM GMT
ehatv

ehatv

Next Story