Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై విషపు రాతలు..!
Vizag Steel Plant: Poisonous writings on Visakhapatnam Steel..!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశానికి సంబంధించిన చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. కారణం ఏంటంటే విశాఖపట్నంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు పని చేయకుండా, కంపెనీ నడిపించమంటే నడిపించగలుగుతామా, ఎన్ని రోజులు అలా నడిపించగలుగుతాం, మీరు కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే, కంపెనీ నడుస్తుందా, ఇప్పటికే 12000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టాం. ఇంక ఎంత పెట్టగలం, రేపు చూడండి, ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి, అవి లాభాల్లో ఉంటాయి, ఇవి నష్టాల్లో ఎందుకు వస్తున్నాయి, కార్మికులు పని చేయకుండా ఇంట్లో పడుకుంటామంటే ఎట్లా, బాధ్యత ఉండక్కర్లేదా, బుద్ధి ఉండక్కర్లేదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు, ఇవి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు మండిపడుతున్నాయి, అనేక రాజకీయ పార్టీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకుంటున్న వాళ్ళంతా, ముఖ్యమంత్రి స్టేట్మెంట్‌ని తప్పుపడుతూ వచ్చాయి. ముఖ్యమంత్రి సమస్య పరిష్కారం దిశగా కాకుండా, ప్రైవేటీకరణ చేస్తే తప్పేంటి తరహాలో మాట్లాడారు, అనే అనుమానాలు కార్మిక సంఘాలకు వస్తూన్నాయి. సరే దానిపైన మళ్ళీ ముఖ్యమంత్రి వివరణ ఇంకా ఇవ్వలేదు, ఇంకా ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి ఆ మాటలు ఎందుకు మాట్లాడారు, ప్రైవేటీకరణ ఉంటుందా లేదా అనే వివరణ ఇవ్వలేదు, ఉండదు అనే మాట పదే పదే చెప్తూ వస్తున్నారు. అఫ్కోర్స్ ఉండదు అనే మాట రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి నేతలు పదే పదే చెప్తూ వస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఎంపీ ప్రైవేటీకరణ గురించి అడిగినా లిఖితపూర్వకంగా చెప్తుంది. ప్రైవేటీకరణకు మేము కట్టుబడి ఉన్నామని, ప్రైవేటీకరణ ప్రాసెస్ ని ఆపేసామనే మాట ఈ క్షణానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఇది నిజం, ఇది వాస్తవం. ముఖ్యమంత్రి మాటలు, ముఖ్యమంత్రి మాటలపైన, కార్మిక సంఘాలు ఆగ్రహం, కమ్యూనిస్ట్ పార్టీల ఆగ్రహం, వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేయడం. మీరు అధికారంలో లేనప్పుడేమో ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పారు, ఇప్పుడేమో ప్రైవేటీకరణ దిశగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి అంటూ వైసిపి కి సంబంధించిన నాయకులు మాట్లాడడం చూశాం. దీని మీద ప్రభుత్వాని కంటే తెలుగుదేశం పార్టీ పత్రిక, ఆంధ్రజ్యోతికి ఎక్కువ కోపం వచ్చింది. ఈరోజు ఫస్ట్ పేజ్ లో ఒక కథనాన్ని రాశారు. వాళ్ళ కథనం ఎవరినో ఆట్రిబ్యూట్ చేస్తూ కూడా కాదు నేరుగా వాళ్ళ పత్రిక ఎజెండాగా రాశారు. విశాఖ ఉక్కు కర్మకారాన్ని ప్రైవేటీకరిస్తున్నారని, ప్రతిపక్షాలు నానాయాగి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, పత్రిక చెప్తున్న మాట, పార్టీ చెప్తున్న మాట కాదు, వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో అది ఇప్పుడు ప్రగతి దిశగా పయనిస్తుంది. అటు కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు నేతృత్వంలో, దానికి ఆ రెండు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. గత 17 నెలల్లో రెండు కలిపి 15వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం గమనార్హం. ఉక్కు సంకల్పం 17 నెలలు 15వేల కోట్ల రూపాయల ఖర్చు విశాఖ ఉక్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం ఇది అని..సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!