Trump Comments: ట్రంప్ వ్యాఖ్యలపై మన మౌనం ఎందుకోసం ?
Why our silence on Trump's comments?
ఆపరేషన్ సింధూర్ లో భారత్ విజయం సాధించింది మనం పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాం. పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లన్నిటిని ధ్వంసం చేశాం. పాకిస్తాన్ తోక ముడిచింది ఇది ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఈ దేశంలో వినిపించిన మాటలు, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా రకరకాల యుద్ధానికి సంబంధించిన వీడియోలను కూడా, భారత మీడియా చూపించటం మనం అంతా గమనించాం. భారత్ గెలిచింది తరహా ఇంప్రెషన్ కనపడింది. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సందర్భంగా భారత దేశానికి సంబంధించిన అధికారులు కూడా అదే విషయాన్ని చెప్తూ వచ్చారు. బట్ ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల రఫెల్ విమానాలు మొదటిసారి కూలిపోయాయి, అవి పాకిస్తాన్ కూల్చింది అంటూ రకరకాల కథనాలు ప్రపంచ మీడియాలో రావడం కూడా చూశాం. అప్పుడు భారతదేశానికి ఇబ్బంది జరిగింది అని ఇక్కడ మాట్లాడితే, దేశానికి ద్రోహం చేసినట్లు అవుతుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ నేపథ్యంలో, దానిపైన చర్చ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు, అయితే ఆపరేషన్ సింధూరు ముగిసిన తర్వాత పాకిస్తాన్ మేము గెలిచామంటూ సంబరాలు చేసుకోవడం, రోడ్ల మీదకి వచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం చూశాం. భారత్ ను ఓడించాం, భారత్ ని వెనక్కి తిప్పికొట్టాం లాంటి ప్రచారాల్ని పాకిస్తాన్ కూడా చేయడం చూశాం. మరోవైపు భారత్ కూడా పాకిస్తాన్ ని అణిచి వేశాం. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పామంటూ మాట్లాడటం చూశాం. ఈ రెండు దేశాల ప్రకటనలు ఇలా ఉంటే అమెరికా అధ్యక్షుడు, ట్రంప్ భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మేమే ఆపామంటూ ప్రకటించడం చూశాం. నిజానికి ఈ దాడులకు సంబంధించి సీస్ ఫైర్ కి సంబంధించిన ప్రకటన అటు, పాకిస్తాన్ నుంచి ఇటు భారతదేశం నుంచి రావడానికి కొద్ది గంటలకు ముందే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. మేము వాళ్ళద్దరి మధ్య రాజీ కుదిర్చాం. యుద్ధం ఆగిపోతుంది అంటూ ఆయన చెప్పారు, ఆయన చెప్పిన కొద్ది గంటలకే ఇటు భారత్ పాకిస్తాన్ కూడా అదే ప్రకటన చేయడం చూశాం. ట్రంప్ ఒకసారి కాదు ఆ తర్వాత వరుసగా కొన్ని పదుల సార్లు భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని మేము ఆపామంటూ అఫీషియల్ గా ప్రకటించడం చూస్తూ వచ్చాం. ట్రంప్ ప్రకటన మరొక విషయాన్ని కూడా తేల్చింది. వాణిజ్యపరమైన లాభం చేకూరుస్తామని చెప్పి, ఈ యుద్ధాన్ని మేము ఆగిపోయేలా చేశాం, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అంటూ ట్రంప్ నేరుగా అడగడం కూడా చూశాం. భారత్-పాకిస్తాన్ మధ్య మూడో దేశం జోక్యాన్ని అనేక దశాబ్దాలుగా భారతదేశం వ్యతిరేకిస్తూ వస్తుంది. కాశ్మీర్ అంశం అనేది కేవలం పాకిస్తాన్ ఇండియా మాత్రమే చర్చించుకొని పరిష్కారం చేసుకోవాల్సిన అంశం తప్ప, మూడో వ్యక్తి ప్రమేయం దీంట్లో ఉండదు, మూడో వ్యక్తి ప్రమేయాన్ని మేము అంగీకరించము అంటూ భారతదేశం అనేక సందర్భాలుగా చెప్తూ వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని మేము ఆపామంటూ ట్రంప్ ప్రకటన చేయడం అనేది భారతదేశ సార్వభౌమధికారాన్ని ప్రశ్నించేలా ఉంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!