వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళబోతున్నారు.

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళబోతున్నారు. ఈ నెల 21న ఆయన కోర్టు మెట్లెక్కబోతున్నారు. ముఖ్యమంత్రి కావడానికంటే ముందు దాదాపు ఆరేళ్ల క్రితం ఆయన కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చి ఆయన కేసులకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేను, ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇక్కడ ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, రెగ్యులర్ గా కోర్టుకు హాజరు కావడం సాధ్యం కాదు అంటూ ఆయన చేసిన అభ్యర్థుల్ని అప్పుడు కోర్టు అంగీకరించింది. కాబట్టి ఆయన కోర్టుకు అటెండ్ కాలేదు, అంతకుముందు పాదయాత్ర చేసిన సందర్భంగా కూడా ప్రతి శుక్రవారం కోర్టుకి అటెండ్ అయ్యారు.

పాదయాత్ర జరుగుతున్న సమయంలో కూడా శుక్రవారం రోజు గ్యాప్ తీసుకొని కోర్టుకి అటెండ్ అయ్యి మళ్ళీ పాదయాత్రలో పార్టిసిపేట్ చేసిన సందర్భం చూశాం. ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మాత్రం ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన ఉండాల్సి వస్తుంది, ప్రతిసారి ముఖ్యమంత్రిగా తను కోర్టుకు హాజరుకావడం అంటే అధికారులకు భద్రత, యంత్రాంగానికి కోర్టు విధులు నిర్వహిస్తున్న వాళ్ళకు కూడా అసౌకర్యంగా ఉంటుంది, కాబట్టి తనను ఎక్స్క్యూస్ చేయండి అంటూ ఆయన అడిగిన మాటను కోర్టు అంగీకరించింది. అప్పుడు మినహాయింపించింది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపించింది. ఇటీవల ఆయన లండన్ పర్యటనకి వెళ్ళారు, పర్యటనకి వెళ్తున్న సందర్భంగా ఆ కోర్టును పర్మిషన్ అడిగారు, ఆ సందర్భంగానే కోర్టు వ్యక్తిగతంగా వచ్చి హాజరుకావాలని అడిగింది. విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా హాజరవుతాను అనే మాట చెప్పారు. తర్వాత కోర్టుకు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేను, వ్యక్తిగతంగా హాజరు కావడం వల్ల భద్రత పరమైన ఇబ్బందులు వస్తాయి, ప్రతిసారి తాను కోర్టుకు హాజరవుతున్న సందర్భంగా భద్రత ఏర్పాట్లు చేయడం కూడా, పనికి మించిన భారంగా ఉండబోతుంది కాబట్టి, తనకు హాజరు నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వండి అంటూ మరోసారి కోర్టులో ఆయన పిటిషన్ వేయడం చూశాం.

కోర్టులో ఆయన వేసిన పిటిషన్ తర్వాత కోర్టు సిబిఐని అడిగింది. ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం పైన మీకు అభ్యంతరం ఉందా, వ్యక్తిగతంగా ఆయన హాజరు కాకపోవడాన్ని మేము అనుమతిస్తే మీకు అభ్యంతరం ఉందా అనే విషయాన్ని కోర్టు సిబిఐని అడిగింది. సిబిఐ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని చెప్పింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా తప్పించుకోడానికి సంబంధించి, లేకపోతే వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వకూడదు అనే విషయాన్ని సిబిఐ కోర్టుకు చెప్పిన నేపథ్యంలో కోర్టు ఆయన్ని వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21వ తారీఖున ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని ప్రకటించారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story