పారిపోవాల్సిన అవసరం , ఖర్మ నాకు పట్టలేదు

తనపై మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) ఇన్‌ఛార్జ్‌ దేవినేని అవినాశ్‌(Devineni avinash) తీవ్రంగా ఖండించారు. పనిపాట లేని మీడియా ఛానళ్లు, టీడీపీ(TDP) సోషల్‌ మీడియా తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. పారిపోవాల్సిన అవసరం కానీ, ఖర్మ కానీ తనకు పట్టలేదన్నారు. దేవినేని బ్లడ్‌లోనే ధైర్యం ఉందని చెప్పారు. రెండు నెలలుగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తన కార్యాలయంలో అందుబాటులోనే ఉంటున్నానని, తాను తప్పు చేశానని కోర్టు తీర్పు ఇస్తే దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని దేవినేని అవినాశ్‌ తెలిపారు. తప్పుడు కేసులకు భయపడి పారిపోయే ప్రసక్తే లేదని, తన తండ్రి నెహ్రూ ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పించారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లా పారిపోయే మనస్తత్వం తనది కాదన్నారు. తమ అధినేత జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళతానని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండి పని చేస్తానని చెప్పారు దేవినేని అవినాశ్‌.

Updated On
Eha Tv

Eha Tv

Next Story