10 శాతం కమీషన్.. టీడీపీ ఎంపీని కోరిన టీడీపీ ఎమ్మెల్యే..?
10 percent commission... a TDP MLA requested this from a TDP MP?

సొంత పార్టీ నేతల నుంచే కమీషన్ వసూలు చేసుకునే పరిస్థితి ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. నేరుగా టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి కాంట్రాక్ట్ పనుల్లో 10% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా? ఇక్కడ మేమే అధిష్టానం అంటూ దబాయించిన ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా పరిధిలో రూ.7 కోట్ల విలువైన పైప్ లైన్ టెండర్ పనులను దక్కించుకున్న టీడీపీ ఎంపీ గుత్తేదారు.
గుత్తేదారుకు ఫోన్ చేసి ఆ పనుల్లో 10% కమిషన్ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాను టీడీపీ ఎంపీ మనిషిని అని చెప్పగా.. నేరుగా ఎంపీకే ఫోన్ చేసి కమీషన్ ఇవ్వాలని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఎంపీ. దీంతో అధిష్టానానికే ఫిర్యాదు చేస్తావా? ఇక్కడ నేనే అధిష్టానం, నాదే రాజ్యం.. నన్నెవడు ఏం చేయలేడు అంటూ దబాయించిన ఎమ్మెల్యే. 10% కమిషన్ ఇవ్వకపోతే సామాగ్రిని ఎత్తుకుపోతాం అంటూ బెదిరింపులు. అధికార ఎంపీకే టీడీపీ ఎమ్మెల్యేలతో కమీషన్ల వేధింపులు తప్పడంలేదని ఎంపీ వాపోయినట్లు తెలుస్తోంది.


