కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో ఒక 70 ఏళ్ల వృద్ధ ఉపాధ్యాయుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో ఒక 70 ఏళ్ల వృద్ధ ఉపాధ్యాయుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. ఈ ఉపాధ్యాయుడు బాలికను సెక్సువల్ ఫేవర్స్ చేయమని ఒత్తిడి చేశాడు. వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రుల అప్రమత్తత వల్ల బాలిక ప్రమాదం నుంచి బయటపడింది, ప్రస్తుతం ఆమె సురక్షితంగా ఉంది.

ఈ ఘటనపై కేసు నమోదై పది రోజులు దాటినా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిని పోలీసులు ఇంకా అదుపులోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు POCSO యాక్ట్ కింద నమోదైనట్లు తెలుస్తోంది, ఈ ఘటనపై పలు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి, పోలీసుల నిష్క్రియాత్మక వైఖరిని విమర్శించాయి. పోలీసులు త్వరగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫోక్సో కేసు నమోదు చేసినప్పటికీ రాజీ కుదిర్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. బాలికపై సెక్సువల్ వేదింపులకు పాల్పడిన వ్యక్తి తిక్కిసెట్టి నట దేవేంద్రరావు (Nata Devendra Rao)అలియాస్ నటరాజ్ మాస్టారు( Natraj Master). 1983 నుండి 1995 వరకు మచిలీపట్టణం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాటశాల()లో పీఈటీ మాస్టారుగా పనిచేశాడు. అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేదించేవాడని సమాచారం.

Updated On
ehatv

ehatv

Next Story