బియ్యం చోరీ చేశారని పేర్ని నాని భార్యపై కేసు

వైసీపీ కీలక నేత పేర్ని నాని (Perni Nani) భార్య జయసుధపై పోలీసులు కేసు పెట్టారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై పౌరసరఫరాలశాఖ అధికారులు చేసిన ఫిర్యాదుతో మచిలీపట్నం (Machilipatnam) పోలీసులు పేర్ని నాని భార్యపై కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలోని పేర్ని నానికి చెందిన గోదామును పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకుంది. అయితే ఇందులో ఉంచిన రేషన్ బియ్యం.. దాదాపు 90 లక్షల విలువైన రేషన్ బియ్యానికి సంబంధించి వివరాల్లో తప్పులు వచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ మంజీర్ జిలానీ అధికారులకు ఆదేశించారు. ఈ అంశంపై పేర్ని నాని కూడా మరో వాదన వినిపిస్తున్నారు. గోదాములో ఉంచిన బియ్యం చాలా రోజులు నిల్వ ఉంచారని.. ఆ తర్వత తరలించగా బియ్యంలో తరుగు వచ్చిందని చెప్పారు. దాదాపు 3200 బస్తాల తరుగు వచ్చాయని.. ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తానని పేర్ని నాని వివరించారు. ఇదే విషయమై నవంబర్ 27న నాని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలికి (Krishna Jilla Joint Collector) లేఖ రాశారు. ఆయన లేఖ రాసిన తర్వాతే అధికారులు గోదాములో తనిఖీలు నిర్వహించారు. 85 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఈ గోదాము పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో ఉంది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story