వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌కు తీసుకొచ్చారు.

వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో మైహోమ్‌ భూజాలో అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. పోలీస్‌స్టేషన్‌లోనే ప్రభుత్వ వైద్యుడు గురుమహేశ్‌ ఆధ్వర్యంలో పోసానికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళిని కాసేపట్లో రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. సినీ పరిశ్రమలో వర్గవిభేదాలు తలెత్తేలా, ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బీఎన్‌ఎస్‌లోని 196, 353(2), 111 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కేసు నమోదైంది. దీనిలోనే పోలీసులు పోసానిని అరెస్టు చేశారు.

ehatv

ehatv

Next Story