నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash raj) ఎక్స్‌ వేదికగా మరో పోస్టు చేశారు.

నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash raj) ఎక్స్‌ వేదికగా మరో పోస్టు చేశారు. అది కూడా ఇప్పుడు వైరల్‌ అవుతోంది. తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను(Pawan kalayan) ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి. ఇప్పుడు తెలుగులో మరో ట్వీట్‌ చేశారాయన! 'చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్‌ ఆస్కింగ్‌' అంటూ ప్రకాశ్‌ రాజ్‌ పోస్ట్ పెట్టారు. సత్యం సుందరం సినిమా వేడుకలో లడ్డూ అంశం ప్రస్తావనకు వస్తే 'లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది' అని హీరో కార్తీ(Karthi) చెప్పడంపై పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేశారు. పవిత్రమైన లడ్డూను అపహాస్యం చేసేలా మట్లాడవద్దని ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్‌ హెచ్చరించడంతో కార్తీ సారీ చెప్పారు. దాంతో వివాదం సమసిపోయింది. అయితే కార్తీ క్షమాపణ చెప్పిన విషయాన్ని ఉద్దేశిస్తూ ప్రకాశ్‌ రాజ్‌ తాజా ట్వీట్‌ చేశారు. ఇప్పుడు దీనికి కూడా పవన్‌ రియాక్టవుతారేమో చూడాలి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story