నటుడు ప్రకాశ్‌రాజ్‌ మళ్లీ ట్వీట్‌ చేశారు. ఈసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యాలను కోట్‌ చేస్తూ అటు చంద్రబాబును, ఇటు పవన్ కల్యాణ్‌లకు చురకలంటించారు.

నటుడు ప్రకాశ్‌రాజ్‌ మళ్లీ ట్వీట్‌ చేశారు. ఈసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యాలను కోట్‌ చేస్తూ అటు చంద్రబాబును, ఇటు పవన్ కల్యాణ్‌లకు చురకలంటించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసిందన్న విషయం తెలిసిందే కదా! ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ చంద్రబాబు(CM Chandra babu Naidu) చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయమూ తెలుసు.

రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా అని సుప్రీం నిలదీసింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్(Prakash raj) ఎక్స్‌ వేదిక‌గా స్పందించాడు. దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదం వ్యవహారంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan) మధ్య మాటల యుద్ధం రాజకీయవర్గాలలోనే కాదు, సినిమావాళ్లకు కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ప్రకాశ్‌రాజ్‌ తన ట్వీట్లతో పవన్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story