ఆదినారాయణరెడ్డి(Adinarayana reddy), జేసీ ప్రభాకర్‌రెడ్డిల(JC Prabhakar reddy) మధ్య ముదిరిన వివాదం.

ఆదినారాయణరెడ్డి(Adinarayana reddy), జేసీ ప్రభాకర్‌రెడ్డిల(JC Prabhakar reddy) మధ్య ముదిరిన వివాదం. ఆర్టీపీపీలో ఫ్లయాష్‌ తీసుకెళ్లేందుకు వెళ్లిన జేసీ ప్రభాకర్‌రెడ్డి వాహనాలను ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడుతున్నారు. దీంతో ఆగ్రహం చెందిన జేసీ కడప ఎస్పీకి ఘాటుగా లేఖరాశారు. లేఖలో ఆర్టీపీపీలో ఫ్లైయాష్‌ తీసుకెళ్లేందుకు మా వాహనాలను ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి(Bhupesh reddy) వర్గీయులు అడ్డుకున్నారు. అయినా మేం సంయమనం పాటించాం..వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అందుకే వైఎస్సార్‌ జిల్లా నుంచి వచ్చే సిమెంట్, ఇసుక వాహనాలను మేమూ అడ్డుకున్నాం. మీరు కోరిన మీదట వాటిని నడవడానికి అనుమతించాం. మా వాహనాలను అడ్డుకోకూడదని మేం కోరాం..అయినా పరిస్థితి మారలేదు. రేపు మేం ఆర్టీపీపీకి వాహనాలను పంపుతున్నాం..వాళ్లు ఆపితే మేం అంత ఈజీగా తీసుకోం. ఇటీవల వారు అదానీ సంస్థపై కూడా ఎటాక్‌ చేశారు. మేం అలాంటి వాళ్లం కాదు. రేపు మా వాహనాలను అడ్డుకుంటే మాత్రం వారి వేదింపులను సహించేది లేదు.

తప్పకుండా సరైన సమాధానం చెప్తాం. ఆదినారాయణరెడ్డిలా టీడీపీ ఓడిపోగానే..బీజేపీలో చేరలేదు. మా వాహనాలను అడ్డుకుంటే సహించేది లేదని జేసీ కడపకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story