AI Deepfake Scam : ఏం తమ్ముళ్లు ఎలా ఉన్నారు...! చంద్రబాబు AI మొహంతో తమ్ముళ్లకు గాళం..!
ఏఐ సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ మొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ చేసి డబ్బులు తీసుకొని ఘరానా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏఐ సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ మొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ చేసి డబ్బులు తీసుకొని ఘరానా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజమని నమ్మి చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లి, మోసపోయామని గ్రహించిన 18 మంది తెలంగాణ టీడీపీ నాయకులు. తెలంగాణ తెలుగుదేశం నాయకులను మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకు దేవినేని ఉమ పీఏ పేరుతో ఫోన్ చేసి, సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పిన దుండగుడు. కాసేపటికి దేవినేని ఉమ మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేసి, టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని, మూడు ఫోన్ పే నంబర్లకు డబ్బు పంపాలని వ్యక్తి చెప్తాడు. దీంతో రూ.35 వేలు డబ్బును సదరు టీడీపీ నాయకుడు పంపించాడు. మరికొన్ని రోజులకు మళ్లీ తిరిగి ఫోన్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, కాసేపట్లో చంద్రబాబు వీడియో కాల్ చేస్తాడని తెలిపిన దుండగుడు. చెప్పినట్టుగానే కాసేపటికి చంద్రబాబు మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేయడంతో, నిజమని నమ్మిన టీడీపీ నాయకులు. కాసేపటికి ఫోన్ చేసి విజయవాడకు వస్తే చంద్రబాబును కల్పించి, బీ ఫాం ఇప్పిస్తానని చెప్పడంతో, విజయవాడకు వెళ్లిన 18 మంది టీడీపీ నాయకులు. హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని చెప్పడంతో, విజయవాడలోని ఒక హోటల్లో బస చేసేందుకు వెళ్లిన నాయకులు. సాయంత్రం తిరిగి ఫోన్ చేసి, చంద్రబాబును కలిసేందుకు 8 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలని తెలిపిన దుండగులు. ఈ క్రమంలో ఫుడ్ బిల్లు చెల్లించాలని అడిగిన హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు గొడవకు దిగగా పోలీసులు రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు దేవినేని ఉమకు ఫోన్ చేయగా, తాను ఎవరికి ఫోన్ చేయలేదని స్పష్టం చేయడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే తమ పరువే పోతుందని, సైలెంట్‌గా వెనుదిరిగిన తెలంగాణ టీడీపీ నాయకులు
