Alapati Rajendra Prasad : జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైంది
సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.

Alapati Rajendra Prasad Slams CM Jagan
సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో మళ్లీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. కొత్త మేనిఫెస్టో విడుదల చేసేముందు పాత మేనిఫెస్టోను ఎంతవరకు అమలుచేశారో తెలపాలన్నారు. 17 శాతం కన్నా ఎక్కువ హామీలు అమలు చేసివుంటే మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో ప్రూ చేయాలన్నారు.
బీసీ సబ్ ప్లాన్ నిధులను మీరు దారి మళ్లించలేదా? రైతాంగం నడ్డివిరిచింది వైసీపీ ప్రభుత్వం కాదా? కార్పొరేషన్ లను, మద్యాన్ని తాకట్టు పెట్టి 8 లక్షల కోట్లు అప్పెందుకు చేశారు? ఏవర్గం జీవన ప్రమాణాలు మెరుగయ్యాయో తెలపాలన్నారు. సామాజిక న్యాయం చేసి ఉంటే సుధాకర్, చంద్రయ్యలు చనిపోయివుండేవారేకాదన్నారు. ఉద్యోగ సంఘాలకు న్యాయం చేయకపోగా.. వారిని సారా కొట్ల వద్ద కాపలా ఉంచారని ఆరోపించారు. జగన్ కు విశ్వసనీయత లేదనడానికి అనేక ఉదాహరణలున్నాయని అన్నారు.
