Amaravathi Capital: అమరావతి రాజధానిపై అఖిలపక్షం అవసరం లేదా..!
అమరావతి రాజధానిపై అఖిలపక్షం అవసరం లేదా..!

అమరావతి అంశానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం చేసిన స్టేట్మెంట్ తర్వాత మరోసారి చర్చ. అమరావతి పైన వైసీపీ విషం కక్కుతోంది, అమరావతి పైన విషం కక్కుతారా, అమరావతి అట్లా, అమరావతి ఇట్లా అంటూ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు చూస్తున్నాం. అమరావతిని ఒక రివర్ బెడ్ లో కడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేయడం చూశాం. రివర్ బెడ్‌లో అమరావతిని కడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి పెద్దగా లాభం ఇవ్వకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడదలుచుకున్న అంశం, మాట్లాడాల్సిన అంశం కంటే, ఆ అంశం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది, నదిలో కడుతుంటే ఇన్నాళ్లు నీకు తెలియదా అనే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆన్సర్ కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట 50 వేల ఎకరాలు తీసుకున్నప్పుడే, ఎకరాకి రెండు కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలు కల్పన కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఓ 50,000 ఎకరాలు అంటున్నారు. గతంలో తీసుకున్నదానికి లక్ష కోట్లు, ఇప్పుడు మరో లక్ష కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో మనం ఉన్నామా, పైగా తీసిపోయేదాన్ని నదీ గర్భంలో కడుతున్నారు అంటూ ఆయన మాట్లాడారు. కేంద్రం కూడా ఆలోచన చేయాలి, మొత్తం అంతా ప్రజలు కూడా దీనిపైన ఆలోచన చేయాలంటూ ఆయన మాట్లాడారు. రాజధానిపైన అస్పష్ట వైఖరితో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేసిన ఈ మాటలు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని కోరుకున్న వాళ్లకు పెద్దగా రుచించకపోవచ్చు కానీ, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా భారం అవుతుందా కాదా అనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అన్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి రివర్లో కట్టమన్నాడు కాబట్టి, మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేసి అమరావతికి మేమే ఛాంపియన్ అంటూ జబ్బలు తరుచుకునే ప్రయత్నం అధికార పార్టీ చేస్తుంది. జబ్బలు చరుచుకుంటున్నారు ముందుకువచ్చి కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన తొడలు కొడుతున్నారు కానీ, మీ వెనక నిలబడ్డ వాళ్ళు ఎవరు మీతో లేరు, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. అమరావతి ఉద్యమం కొనసాగుతున్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీతో పాటు కలిసి నడిచిన వ్యక్తులు ఎవరూ మీ వెనక లేరు ఒకసారి చూసుకోండి. మీతో కలిసి నడిచిన రైతులు, మీతో కలిసి నడిచిన మహిళలు, మీతో కలిసి నడిచిన పార్టీలు, ఈరోజు మీతో లేవు, వన్ ఫైన్ డే ఈవెన్ జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని ఒంటరిని చేస్తాయి. అమరావతి అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అన్నది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేద్దాం అనే కోణంలో వెళ్తే రాజకీయంగా నష్టపోతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, గతంలో అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఒప్పుకున్నాడు, తర్వాత ఆయన మాట మార్చాడు అంటూ విమర్శ చేయడానికి, తెలుగుదేశం పార్టీకి బలం ఉంది, ఆ విమర్శని ప్రజలు నమ్మారు, అది నిజం కూడా, అమరావతి వేదికగా రాజధాని ఉండాలనే అంశాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. అసెంబ్లీ సాక్షిగా ఆ తర్వాత ఆయన మాట మార్చారు లాంటి ప్రచారాన్ని జనం బిలీవ్ చేశారు. ఇప్పుడు అసెంబ్లీ కి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, రెండో విడత భూసేకరణకు సంబంధించి ఎవరిని అడిగి మీరు నిర్ణయం తీసుకున్నారు, అంటే ఆన్సర్ చెప్పే పరిస్థితిలో మీరు లేకుండా పోయారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


