Amaravathi: అమరావతి మునిగిందా.. ఏది నిజం..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నీళ్లలో ఉందా, అమరావతి మునిగిపోయిందా, ఇటీవల సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తున్నాం. అమరావతిలోని ఐకానిక్ టవర్స్ ప్రదేశం అంతా పూర్తిగా నీటితో నిండిపోయింది అని, ఆరేడు అడుగులకు పైగా నీళ్లు అక్కడ ఉన్నాయనే విజువల్స్‌ని చాలా చూస్తూ ఉన్నాం, ఐకానిక్ టవర్స్ మునిగిపోలేదు, ఆ ప్రాంతంలో ఉన్న నీళ్లు పునాదులు తీయడం కారణంగా వచ్చిన నీళ్లే తప్ప, వరద జలాలు కాదు, అది మునిగిపోయింది కాదు అంటూ, ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు చూస్తున్నాం. మరోవైపు అమరావతి ప్రాంతం మునగకుండా ఉండటం కోసం, అమరావతి మునిగితే పెట్టుబడులు రావనో, లేకపోతే అది నీళ్లతో నిండిన రాజధానిగా ఉంటుంది అని విమర్శలు వస్తాయనో భయంతో, ప్రభుత్వం పొన్నూరు ప్రాంతంలోని 70 వేల ఎకరాల పంటభూముల్ని ముంచేస్తుంది, పొన్నూరు ప్రాంతాన్ని ముంచేస్తుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. సో సోషల్ మీడియాలో విస్తృతంగా వీడియోలు చూస్తున్నాం, అమరావతి ప్రాంతానికి సంబంధించి అమరావతిలో నీళ్ళ వచ్చాయా అనే అంశానికి సంబంధించి రకరకాల మీమ్స్ ట్రోల్స్ చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా, చంద్రబాబు చెప్పిన మాట, అమరావతి మునిగిందంటూ ఎవరైనా ప్రచారం చేస్తే, వాళ్ళపైన కేసులు పెడతాం, అమరావతి మునిగిందంటూ ప్రచారం చేస్తున్న వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, అమరావతి మునగలేదు, మునిగిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్, అమరావతి మునగకపోతే, అమరావతిలో నీళ్లే లేకపోతే, అక్కడ నీళ్లు ఉన్నాయని ఆ ప్రాంతం మునిగిందని ప్రచారం చేస్తున్న వాళ్ళని కేవలం శిక్షిస్తాం, కేసులు పెడతాం అని వార్నింగులు ఇవ్వడం కాదు, వాళ్ళని శిక్షించాల్సిందే, ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని పైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళ పైన కేసులు పెట్టాల్సిందే. అవసరమైతే పిడి కేసులు పెట్టయినా లోపల పెట్టండి, తప్పేమీ లేదు కానీ, రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు మునిగిందా లేదా మునిగిందని వైసీపీ చెప్తోంది, చాలా సోషల్ మీడియా వీడియోస్ చూస్తున్నాం. చాలా మంది అక్కడికి వెళ్లి ఇదే ఐకానిక్ టవర్స్ మునిగిపోయినాయి అని చూపిస్తున్నారు, ప్రభుత్వం మునగలేదు అని చెప్తుంది, ఏది నిజం, దేన్ని నమ్మాలి, ప్రభుత్వం మునగలేదు అంటే దాన్ని నమ్మాలా, ఎవరో మునిగింది, ఇదిగో ఇదే నేను ఇక్కడికి వెళ్ళాను, ఫిజికల్ గా చూస్తున్నాను, ఇదే ప్రాంతం మునిగిపోయింది అని ఎవరో పెడుతున్న వీడియో నమ్మాల, దేన్ని నమ్మాలి. ఇక్కడ ప్రభుత్వానికి ఒక సలహా చెప్పదలుచుకున్నా, ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నా, ఏంటంటే అమరావతి రాజధానిగా ఉండాలి, మూడు రాజధానులు అవసరం లేదు, అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధానిగా ఉండాలి, అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు, భూములు తీసుకున్న తర్వాత ఇప్పుడు రైతుల్ని మోసం చేస్తే ఎలా, ఆ ప్రాంతంలో రాజధాని మేము కట్టమని ప్రభుత్వం చెప్తే ఎలా అంటూ గడిచిన ఐదేళ్ళు పోరాటం జరిగితే, అటువంటి పోరాటానికి మాలాంటి వాళ్ళంతా మద్దతి ఇచ్చాం.
ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
