రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు భూసేకరణ ఒత్తిళ్లతో తల్లడిల్లిన ఓ రైతన్న గుండె ఆగింది!

రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు భూసేకరణ ఒత్తిళ్లతో తల్లడిల్లిన ఓ రైతన్న గుండె ఆగింది! గతంలోనే భూ సమీకరణ కింద రెండు ఎకరాల భూమి ఇచ్చిన రాజధాని రైతు దొండపాడు రామారావు(68) ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూడా ప్రభుత్వం రోడ్డు కోసం సేకరిస్తుండటంతో తీవ్రంగా కలత చెందాడు.

తాను ఇచ్చిన రెండెకరాల పొలానికి బదులుగా.. వాగులో ముంపునకు గురయ్యే ప్రాంతంలో రిటర్నబుల్‌ ప్లాటు ఇవ్వడంతో మానసికంగా కుంగిపోయిన రామారావు.. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం నిర్వహించిన సభలోనే ఆందోళనతో కుప్పకూలి మృతి చెందాడు. రాజధాని ఎన్‌–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న రైతులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ విషాదం చోటు చేసుకుంది. రాజధానిలో ఎన్‌–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ..

అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ ఆక్రోశించారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు.

ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్‌లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు.

ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Updated On
ehatv

ehatv

Next Story