Amaravathi: అమరావతి ఆంధ్రుల రాజధాని.. వేశ్యులది కాదు..!

అమరావతి గడిచిన 8 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయన హయాంలో రాజధాని పనులు కూడా జరిగాయి. అప్పుడు అందరూ అమరావతి రాజధానిని అంగీకరించారు. కొన్ని డబ్బులు కూడా ఖర్చు చేశారు. ఆ తర్వాత వైసీసీ రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించింది. అమరావతి చుట్టూ ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని పెద్, అసైన్డ్ ల్యాండ్లు పట్టా చేయించుకున్నారని.. రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో శాసన రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని, విశాఖలో పరిపాలనా రాజధాని చేస్తామని ప్రకటించింది. ఒక్క ప్రాంతంలోనే అభివృద్ధి చేస్తే ఒక్క ప్రాంతంలోనే డబ్బులన్నీ ఖర్చు చేస్తే రాష్ట్రంలో అసమానతలు నెలకొనే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టింది. ఆ తర్వాత లీగల్ హడిల్స్‌ కారణంగా ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. వైసీపీ నిర్ణయంతో ఆ రైతులంతా ఆందోళన చేశారు. అమరాతిని డెవలప్‌ చేయకపోతే మా పరిస్థితేంటని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీ అమరావతికి వ్యతరేకమనే ముద్ర అయితే పడింది. అమరావతిని వైసీపికి ఇష్టం లేని పార్టీగానే ప్రజలు చూశారు. ఇప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేస్తామని ప్రకటించింది. అయితే ఈరోజు సాక్షి టీవీలో జరిగిన టీవీ చర్చా కార్యక్రమంలో మరోసారి ఇది రుజువైంది. ఏంటనేది.. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On 9 Jun 2025 5:23 AM GMT
ehatv

ehatv

Next Story