అమరావతి రాజధాని పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ (Ap)ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

అమరావతి రాజధాని పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ (Ap)ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దృష్ట పెట్టింది. 2025 మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అమరావతి పునర్నిర్మాణ పనులను రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులతో పునఃప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సచివాలయం వెనుక బహిరంగ సభ జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నాయకత్వంలో, అమరావతి(Amaravati)ని మూడేళ్లలో పూర్తిగా నిర్మించి, ప్రపంచంలోని టాప్-5 నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దాలనే సంకల్పం పెట్టుకున్నారు. 2014-19లో రూపొందించిన పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణం కొనసాగుతోంది. అమరావతిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారుల నివాస భవనాల నిర్మాణం జరుగుతోంది. ఈ భవనాలకు టెండర్ ప్రక్రియ ముగిసింది. సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 200 అడుగుల వెడల్పుతో 8 వరుసల రోడ్డు నిర్మాణం కొనసాగుతోంది. ఈ రోడ్డు భూసమీకరణ సమస్యల వల్ల కొంత ఆలస్యమైంది. కృష్ణా నది ఒడ్డున వంపులు తిరిగే కాలువలు, రెండు వైపులా ఉద్యానవనాలతో వెస్ట్ & ఈస్ట్ పార్క్ రోడ్లు అమరావతిని సౌందర్యాత్మకంగా నిర్మిస్తున్నారు. 250 మీటర్ల ఎత్తుతో ఐకానిక్ అసెంబ్లీ భవనం నిర్మాణానికి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ డిజైన్ చేస్తున్నారు. 2014-19లో 25,000 రైతుల నుంచి 30,000 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం మరో 44,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించేందుకు రైతులతో చర్చలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులకు అభివృద్ధితో పాటు విలువైన ప్లాట్లు, ఆర్థిక ప్రయోజనాలు అందిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. రూ.65,000 కోట్లతో 92 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి, వీటిలో 42 పనులకు రూ.41,725 కోట్ల టెండర్లు పూర్తయ్యాయి.

డిప్యూటీ సీఎం పవన్‌ పేరు లేకపోవడంతో వివాదం..!

అమరావతి పునర్‌ నిర్మాణ ఆహ్వాన పత్రికలో డిప్యూటీ సీఎం పవన్‌ (Pawan Kalyan )పేరు లేకపోవడంతో వివాదం అవుతోంది. అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమం ఆహ్వాన పత్రికలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం ఆహ్వాన పత్రికలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంపై జనసేన (Jsp)కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్‌ను "కూరలో కరివేపాకు"లా పక్కనపెట్టారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, జనసేన పార్టీని ట్యాగ్ చేసి పవన్ పేరు లేకపోవడంపై ప్రశ్నించారు.

Updated On 30 April 2025 7:16 AM GMT
ehatv

ehatv

Next Story