తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళి సై సౌందర్‌రాజన్‌(Tamilasai Soundharyarajan) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి(Swearing Ceremony) హాజరయ్యారు.

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళి సై సౌందర్‌రాజన్‌( tamilisai soundararajan) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి(Swearing Ceremony) హాజరయ్యారు. అప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తమిళిసై మధ్య ఏదో సీరియస్‌ సంభాషణ జరిగినట్లు కనిపించింది. అమిత్ షా హావభావాలు చూస్తే ఏదో క్లాస్‌ తీసుకుంటున్నట్టుగానే అనిపించింది. ఈ దృశ్యం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మీడియాలో కూడా చర్చ జరిగింది. ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? తమిళిసైకి అమిత్ షా చేసిన హెచ్చరిక ఏమిటి? అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్ల మధ్య చర్చ జరిగింది. తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామళైతో విభేదాలకు స్వస్తి చెప్పి సఖ్యతగా మసులుకోమని అమిత్‌ షా చెప్పినట్టు కొందరు భావించారు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే వార్తలపై తమిళిసై స్పష్టత ఇచ్చారు. 'నిన్న నేను హోంమంత్రి అమిత్ షా ను కలిశాను. 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆయన నన్ను అడిగారు.. రాజకీయంతో పాటు నియోజక వర్గ పనులను చూసుకోవాలని సూచించారు.. నా గురించి వస్తున్న ఊహాగానాలకు స్పష్టత ఇవ్వడానికి ఈ పోస్టు' అంటూ ఎక్స్‌లో మెసేజ్‌ పెట్టారు తమిళిసై.

Updated On
Eha Tv

Eha Tv

Next Story