అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్‌లో మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.

అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్‌లో మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో జరిగిన ప్రమాదంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించేందకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా.. ప్రైవేటు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గాయపడిన నలుగురు కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని అధికారులను సిఎం ఆదేశించారు.

జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో గురువారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. బాధితుల్ని అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌లో తరలించాలని సిఎం ఆదేశించారు

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story