✕
An elderly man attempted: పండగ నాడు చంద్రబాబు ఇంటి ఎదుట వృద్ధుడు ఆత్మహత్యాయత్నం..!
By ehatvPublished on 14 Jan 2026 7:58 AM GMT
పండగ నాడు చంద్రబాబు ఇంటి ఎదుట వృద్ధుడు ఆత్మహత్యాయత్నం..!

x
సంక్రాంతి పండుగ వేళ సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఓ వృద్దుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు పండుగ వేడుకల్లో ఉండగా ఘటన జరిగింది. చంద్రబాబు నాయుడుతో తమ సమస్యలను తెలిపేందుకు వెళ్ళిన చిత్తూరు జిల్లా రాజయ్యగారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) అనే వృద్ధుడు. ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అందుకు అనుమతించలేదు. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సమాచారం. నారావారిపల్లె ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన వైద్యులు

ehatv
Next Story

