యాంకర్‌ శ్యామల మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై విరుచుకుపడ్డారు.

యాంకర్‌ శ్యామల మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై విరుచుకుపడ్డారు. తన వాదనలు గట్టిగా వినిపిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలు వదులుతున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు(CM Chandra Babu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan)పై పదునైన విమర్శలు చేశారు. సీఎం సొంత జిల్లా చిత్తూరు(Chitoor)లో ఆరేళ్ల బాలిక హత్య ఘటనపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు. బాలిక హత్యతో ఏపీ(Ap)లో శాంతిభద్రతలు కొరవడ్డాయన్నారు.ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. గ్యారంటీల పేరు చెప్పి జనాలను మోసం చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని, సినిమా డైలాగులు కొట్టి పదవులు దక్కించుకున్న నేతలు అత్యాచారాలపై మాట్లాడరేంటి అని పరోక్షంగా పవన్‌ను నిలదీశారు. సీఎం సొంత జిల్లాలోనే దారుణం జరిగిందన్నారు. చంద్రబాబొ అదొస్తుంది.. ఇదొస్తుందన్నారని.. కానీ ఆయనొచ్చాక ఆడ పిల్లల ప్రాణాలు పోతున్నాయని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం శ్యామల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Updated On
ehatv

ehatv

Next Story