Andhra Pradesh CM YS Jagan : రేపు సీఎం జగన్ మూలపేట పర్యటన
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) బుధవారం శ్రీకాకుళం(Srikakulam) జిల్లా సంతబొమ్మాళి(Santhabommali) మండలం మూలపేట పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు(Mulapet Green Field Port) నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎంఓ అధికారులు పర్యటన ఫెడ్యూల్‌ను విడుదల చేశారు. సీఎం జగన్ ఉదయం 8 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు మూలపేట(Mulapeta) చేరుకుంటారు. 10.30 – 10.47 గంటల మధ్య ముఖ్యమంత్రి మూలపేట గ్రీన్‌ఫీల్డ్ […]

CM Jagan will visit Mulapet Village of Srikakulam district Tomorrow,
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) బుధవారం శ్రీకాకుళం(Srikakulam) జిల్లా సంతబొమ్మాళి(Santhabommali) మండలం మూలపేట పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు(Mulapet Green Field Port) నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎంఓ అధికారులు పర్యటన ఫెడ్యూల్‌ను విడుదల చేశారు. సీఎం జగన్ ఉదయం 8 గంటలకు తాడేపల్లి(Thadepalli) నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు మూలపేట(Mulapeta) చేరుకుంటారు. 10.30 – 10.47 గంటల మధ్య ముఖ్యమంత్రి మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. కార్యక్రమంలో భాగంగా గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 11.25 – 11.35 గంటల మధ్య నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేస్తారు. దీంతోపాటు ఎచ్చెర్ల(Etcherla) మండలం బుడగట్లపాలెం(Budagatlapalem) ఫిషింగ్ హార్బర్, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 11.40 – 12.30 గంటల మధ్య బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు, అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి సమావేశం అవుతారు. అనంతరం సన్మాన కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
