నేడు ఏపీ కేబినెట్‌(AP Cabinet) కీలక సమావేశం కానుంది.

నేడు ఏపీ కేబినెట్‌(AP Cabinet) కీలక సమావేశం కానుంది. సీఎం నారా చంద్రబాబు(Chandrababu) నాయుడు అధ్యక్షతన భేటీ జరగనుంది. రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్మాణాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఐఐటీ నిపుణులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన ఆరు హామీల అమలుపై కసరత్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆగస్ట్ 15 నుంచి మూడు పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Travel), తల్లికి వందనం పథకం, అన్న క్యాంటిన్లను ఆగస్ట్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే అన్న క్యాంటిన్ల ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత ఉంది. ఆగస్ట్ 15 నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

అయితే బస్సులో ఉచిత ప్రయాణం చేయాలంటే కండీషన్స్‌ అప్లై అంటున్నారు అధికారులు. ఈ ఉచిత బస్సు సౌకర్యం పొందేందుకు ముందగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు(Online registration) చేసుకోవాల్సి ఉంటుంది.పథకం కోసం దరఖాస్తు చేయడానికి, వినియోగదారు ఈ క్రింది దశలను అనుసరించాలి. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తులో అవసరమైన అన్ని వివరాలతో ఫాం నింపాలి. ఆ తర్వాత, అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి చివరగా సబ్మిట్ బటన్‌ నొక్కితే దరఖాస్తు పూర్తవుతుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story