ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలను(AP Alcohol prices) తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలను(AP Alcohol prices) తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీని ప్రకటించినా ధరలు కొంత పెరిగాయని వాపోయారు. దీనిపై విమర్శలు రావడంతో పలు బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించారు. ధరలు తగ్గిన బ్రాండ్లలో మాన్షన్‌ హౌస్ ఒకటి. 2019లో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి క్వార్టర్‌ రూ.110 ఉన్న మద్యాన్ని వైసీపీ(YCP) హయంలో ధర రూ.220కు ఫిక్స్‌ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాన్షన్‌ హౌస్‌(Mansion House) బ్రాందీ క్వార్టర్‌ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. అదే బ్రాండ్‌ హాఫ్‌ బాటిల్‌ ధర రూ.440 నుంచి రూ.380కి, ఫుల్‌ బాటిల్‌ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గించారు. రాయల్‌ చాలెంజ్‌ సెలెక్ట్‌ గోల్డ్‌ విస్కీ క్వార్టర్‌ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఇదే బ్రాండ్‌ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గించారు. యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్‌

దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఇప్పుడు వాటిని తగ్గించే దిశగా మద్యం కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు క్రమంగా ధరలు తగ్గించేందుకు అంగీకరిస్తున్నాయి. ఇప్పటికే మూడు కంపెనీల ధరల తగ్గింపు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యాంటిక్విటీ విస్కీ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.1600 నుంచి రూ.1400కు తగ్గింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story