తిరువూరు మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరగంటలో భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

తిరువూరు మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరగంటలో భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని సూచించింది.తిరువూరు మున్సిపల్ ఎన్నికపై వైఎస్సార్సీపీ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని పేర్కొంది.

వైఎస్సార్సీపీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై మంగళవారం (మే20) ఏపీ హైకోర్టు (Ap High Court)విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను పోలీసులు పాటించడం లేదంటూ వైఎస్సార్సీపీ (YSRCP)తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు అరగంటలో డీసీపీ స్థాయి అధికారితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించడమే కాదు, తక్షణమే ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

ehatv

ehatv

Next Story