అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)ప్రజల స్పందన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)ప్రజల స్పందన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అమరావతి(Amaravati)ని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి నిన్నటి పునర్నిర్మాణ సభ వరకు పలు కీలక మలుపులు తిరిగింది. అమరావతి రాజధాని కోసం గుంటూరు(Guntur), కృష్ణా (Krishna)జిల్లాల్లో 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (Land Pooling Scheme) ద్వారా ఇచ్చారు. ఈ రైతులు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని గట్టిగా కోరుకుంటున్నారు, ఎందుకంటే వారికి అభివృద్ధి చెందిన ప్లాట్లు, ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని ఆశ. 2024లో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మళ్లీ అధికారంలోకి వచ్చాక, అమరావతి పనులు రీస్టార్ట్ అవుతున్నాయని వారిలో ఆశలు మళ్లీ చిగురించాయి.

చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో వారి అనుకూలుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. నిన్న ప్రధాని మోదీ(PM Modi) 58,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, వరల్డ్ బ్యాంక్(World bank) నుంచి దాదాపు 7 వేల కోట్ల రుణం రావడంతో ఇక్కడ పనులకు ఊతం కానుంది. అమరావతిని ప్రజల రాజధానిగా, గ్లోబల్ సిటీగా మారుస్తామని నారా లోకేష్ (Nara Lokesh)నాయకులు ప్రచారం చేస్తున్నారు. అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చాలనే చంద్రబాబు విజన్‌కు కొంతమంది సామాన్య ప్రజలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు మద్దతు ఇస్తున్నారు. 1.5 మిలియన్ ఉద్యోగాలు, 3.5 మిలియన్ జనాభా, 35 బిలియన్ డాలర్ల జీడీపీ సాధించాలనే లక్ష్యాలు యువతలో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

వైసీపీ (Ycp)ప్రభుత్వం 2019-2024 అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే ఉంచి, విశాఖను ఆడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా, కర్నూలును జుడీషియల్ రాజధానిగా చేయాలని ప్రతిపాదించింది. ఈ మూడు రాజధానుల ఆలోచనకు విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లోని కొంతమంది మద్దతు ఇచ్చారు, ఇది రాష్ట్రవ్యాప్తంగా సమాన అభివృద్ధిని తెస్తుందని వారి భావించారు. అమరావతి రాజధాని కొద్దిమంది భూస్వాములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభం చేకూరుస్తుందని, సామాన్య ప్రజలకు ఉపయోగం ఉండదని వైసీపీ అనుకూలురు వాదిస్తున్నారు.కొందరు ఇది వరదలకు గురయ్యే ప్రాంతమని, రాజధానిగా పనికిరాదని, లేదా దీనివల్ల రైతుల భూములు దోపిడీ అవుతున్నాయని విమర్శలు వచ్చాయి.

మరోవైపు 2019లో వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు, అమరావతి రైతులు, మహిళలు, యువత భారీగా ఆందోళనలు చేపట్టారు. 2020లో అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో నిర్వహించిన ప్రజా పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. రైతులు "జై అమరావతి", "సేవ్ అమరావతి" నినాదాలతో నిరసనలు చేశారు. అమరావతి అభివృద్ధికి భారీ ఖర్చు 64,910 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆర్థిక భారమని, ఇతర ప్రాంతాల అభివృద్ధి నిర్లక్ష్యం అవుతుందని కొందరు విమర్శిస్తున్నారు.

ehatv

ehatv

Next Story