ఎన్టీఆర్(NTR), వైఎస్‌ఆర్‌(YNR).. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఈ నేతలు చెరగని ముద్రవేశారనే చెప్పాలి. 1983లో తెలుగువారి ఆత్మగౌరవం కోసమని పార్టీ పెట్టి ప్రపంచంలో తెలుగువారికి ఓ గుర్తింపును ఎన్టీఆర్‌ తీసుకొచ్చారు. అనతికాలంలోనే ఎన్టీఆర్‌ ఉమ్మడి రాష్ట్రంలో అపూర్వ ఆదరణ పొందారు. బడుగుబలహీనవర్గాలను అక్కున చేర్చుకున్న పార్టీగా పేరొచ్చింది. కాంగ్రెస్‌లోనే తన జీవితాన్ని ధారపోసిన మరోనేత వైఎస్‌ఆర్. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమించిన వైఎస్‌.. తనదైనశైలిలో పథకాలు, పాలనకొనసాగించి కాంగ్రెస్‌ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చారు.

ఎన్టీఆర్(NTR), వైఎస్‌ఆర్‌(YNR).. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఈ నేతలు చెరగని ముద్రవేశారనే చెప్పాలి. 1983లో తెలుగువారి ఆత్మగౌరవం కోసమని పార్టీ పెట్టి ప్రపంచంలో తెలుగువారికి ఓ గుర్తింపును ఎన్టీఆర్‌ తీసుకొచ్చారు. అనతికాలంలోనే ఎన్టీఆర్‌ ఉమ్మడి రాష్ట్రంలో అపూర్వ ఆదరణ పొందారు. బడుగుబలహీనవర్గాలను అక్కున చేర్చుకున్న పార్టీగా పేరొచ్చింది. కాంగ్రెస్‌లోనే తన జీవితాన్ని ధారపోసిన మరోనేత వైఎస్‌ఆర్. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమించిన వైఎస్‌.. తనదైనశైలిలో పథకాలు, పాలనకొనసాగించి కాంగ్రెస్‌ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్ వారసులే ఏపీలో నాలుగు పార్టీలను శాసిస్తున్నారు.

ఏపీ కాంగ్రెస్‌లో రాజశేఖర్‌రెడ్డి పాత్ర చెరగని ముద్ర వేసుకుంది. ఆయన తదనంతరం కాంగ్రెస్‌తో(Congress) జగన్‌కు పొసగక ఆ పార్టీ నుంచి బయటకొచ్చి వైఎస్‌ఆర్‌సీపీని స్థాపించి 2014లో చెప్పుకోదగ్గ స్థానాలు సాధించి, ప్రతిపక్షంలో ఉండి వీరోచిత పోరాటం చేసి 2019లో 151 సీట్లతో తిరుగులేని మెజార్టీ సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌(Congress) బాధ్యతలు చేపట్టారు. మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని జగన్‌ ఉవ్విళ్లూరుతున్నారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థులను మారుస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వైనాట్ 175 అంటూ పవర్‌లోకి వచ్చేందుకు శ్రమిస్తున్నారు.

జాతీయ పార్టీ కాంగ్రెస్‌.. ఇప్పుడు వైఎస్‌ ఫ్యామిలీ వేదికగా రాజకీయాలు చేస్తుందనే చెప్పాలి. పార్టీలో చేరిన కొద్దిరోజులకే పీసీసీ చీఫ్‌గా షర్మిలకు(YS Sharmila) బాధ్యతలు అప్పగించింది. వైసీపీలో అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి వారసురాలు, పైగా తమ శత్రువైన జగన్‌కు చెల్లెలు అయిన షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తే ఆది నుంచి వస్తున్న కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును మళ్లీ తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. తొలి నుంచీ రెడ్డి సామాజికవర్గం నేతలు కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నారు. జగన్‌ పార్టీ స్థాపించిన తర్వాత దాదాపు ఈ ఓటు బ్యాంక్‌ అక్కడికే వెళ్లిందనే చెప్పాలి. షర్మిల ద్వార వైసీపీలో ఇమడలేకపోతున్న నేతలను ఆకర్షించేందుకే కాంగ్రెస్‌ ఈ ఎత్తుగడ వేసిందనే చెప్పాలి. కుమారుడు పెళ్లి తర్వాత ఏపీ రాజకీయాలపై షర్మిల పూర్తిగా దృష్టిసారించే అవకాశం ఉంది.

మరో పార్టీ టీడీపీ.. ఎన్టీఆర్‌ కుటుంబమే ఆది నుంచీ ఈ పార్టీని శాసిస్తోంది. పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతీ సారీ టీడీపీ తిరిగి నిలదొక్కుకుంది అంటే అది నమ్మకమైన టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబు(Chandrababu) రాజకీయ వ్యూహాల వల్లేనని ఆయన అభిమానులు చెప్తారు. 70ఏళ్ల పైబడ్డా కూడా ఆయన పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. స్కిల్ స్కాం లో రిమాండ్ కు వెళ్లి వచ్చిన చంద్రబాబు ప్రజల్లో వచ్చిన సానుభూతి నీ ఓట్ల రూపంలో మార్చుకుని జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చూస్తున్నారు. కుమారుడు లోకేష్(Nara Lokesh), జనసేన(Janasena) అధినేత పవన్(Pawan kalyan) టీడీపీ-జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తేనే బలమైన జగన్‌ను ఢీకొనగలమనేది వీరి వాదన.

దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలోనూ బలపడాలనుకుంటుంది. అందుకు ఆ పార్టీకి కూడా ఎన్టీఆర్‌ కుటుంబమే దిక్కయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని(Purandeshwari) నియమించింది. బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆమె రాష్ట్రవ్యాప్తంగా బీజీపీనీ క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. ఎన్టీఆర్ వారసత్వం తో పాటు భాష మీద పట్టు, గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం పార్టీకి కలిసొస్తుందని అధిష్టానం భావిస్తోంది. చంద్రబాబు భార్య భువనేశ్వరికి సోదరి అయిన పురందేశ్వరి.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తే ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారు. దీంతో రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు అటు ఎన్టీఆర్, ఇటు వైఎస్‌ కుటుంబాల చుట్టే తిరగడం గమనార్హం.

Updated On 21 Jan 2024 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story