Andhra Pradesh : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న కిలాడి లేడీ
విడాకుల కోసం కోర్టులో కేసు వేసిన వారు.. డబ్బున్న మగవారే ఈమె టార్గెట్.

విడాకుల కోసం కోర్టులో కేసు వేసిన వారు.. డబ్బున్న మగవారే ఈమె టార్గెట్. ఏపీ(Ap) కోనసీమలో డజన్ పెళ్లిళ్లు చేసుకొని కోట్లు సంపాదించిన యువతి, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ (Konaseema)జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన బేతి వీరదుర్గ నీలిమ(Veera Durga Nelima) అనే యువతి, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడి, రెండేళ్లలో 12 మంది డబ్బున్న ఒంటరి పురుషులను పెళ్లి చేసుకొని కోట్లు దోచుకుంది. పెళ్లికాని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, డబ్బున్న ఒంటరి పురుషులు, భార్యతో విబేధాలున్న మగవారిని టార్గెట్ చేసి వారినే పెళ్లి చేసుకున్న యువతి. యువతి చేసే అక్రమాల్లో తనకు తోడుగా కుటుంబ సభ్యులుగా నటించిన దుర్గ(Durga), వీరలక్ష్మి(Veralaxmi), కళ్యాణ్ (Kalyan)అనే ముగ్గురు వ్యక్తులు తనకు తెలిసిన లాయర్ల ద్వారా విడాకులకు దరఖాస్తు చేసిన మగవారి వివరాలు సేకరించి, వారితో ప్రేమగా మాట్లాడి పెళ్లి వరకు తీసుకెళ్లి, ఇల్లరికం రావాలనే కండీషన్ పెట్టిన యువతి. పెళ్లి చేసుకున్న ఫొటోలతో పాటు, సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేసి అనేక మంది వద్ద కోట్ల రూపాయలు దోచుకున్న యువతి. రెండేళ్ల కాలంలో 12 మందిని మోసం చేసి పెళ్లి చేసుకోవడంతో, తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు
