మూడు పార్టీల పొత్తు అభివృద్ధికి మంచి చిహ్నమన్నారు సంజీవ్‌కుమా

వైఎస్సార్‌సీపీ కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ అమరావతిలో చంద్రబాబు సమక్షంలో అధికార పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేయాలని భావిస్తున్నారు. కర్నూలు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఎంపీని అయ్యానని, కేంద్రం నుంచి తెచ్చిన నిధులు తప్ప ఏమీ చేయలేకపోయానని సంజీవ్ కుమార్ అన్నారు. వైసీపీ పదవులు ఇచ్చినా అధికారం లేదన్నారు. మూడు పార్టీల పొత్తు అభివృద్ధికి శుభసూచకమని, కర్నూలులోని సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలుగుదేశంలో చేరానని.. ఎలాంటి సీటు ఆశించకుండా భేషరతుగానే తెలుగుదేశంలో చేరానని ఆయన తెలిపారు.

మూడు పార్టీల పొత్తు అభివృద్ధికి మంచి చిహ్నమన్నారు సంజీవ్‌కుమార్‌. పవన్ కళ్యాణ్ జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ ఈ ఎన్నికల్లో పోరాడుతోంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లో తిరిగి చేరింది. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల నుండి పోటీ చేయనుండగా, జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్ సభ నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది.

Updated On 14 March 2024 2:16 AM GMT
Yagnik

Yagnik

Next Story