మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే

యూనియన్ బడ్జెట్ 2023-24లో ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) మహిళలకు ప్రత్యేక పొదుపు పథకాన్ని అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అధికారికంగా ఏప్రిల్ 1, 2023న ప్రారంభించగా.. మార్చి 2025 వరకు తెరిచి ఉంటుంది. MSSC ఖాతాలను తెరవడానికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, భాగస్వామ్య ప్రైవేట్ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారం ఇచ్చింది. దేశంలోని పోస్టాఫీసుల్లో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

ఇక మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్నాటక రాష్ట్రాలు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకాన్ని 2023–24 బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మహిళలు, బాలికల కోసం తీసుకుని వచ్చిన పొదుపు పథకం ఇది. జనవరి నాటికి దేశ వ్యాప్తంగా 24,13,500 మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ ఖతాలు తెరచారు. ఏపీ 1.35 లక్షల ఖాతాలతో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. రెండేళ్ల పాటు మహిళలు, బాలికల పేర్న గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్‌ సౌకర్యాన్ని అందిస్తుంది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. పొదుపును ప్రోత్సహించడానికి, ఆర్థికంగా తోడ్పాటును అందించడానికి మహిళల కోసం ఈ పథకం రూపొందించారు. MSSC ఖాతాలను మహిళలు లేదా మైనర్ బాలికల చట్టబద్ధమైన సంరక్షకుని ద్వారా తెరవవచ్చు.

Updated On 2 March 2024 9:55 PM GMT
Yagnik

Yagnik

Next Story