Another Jana Sena leader Controversy: ఏపీలో వెలుగులోకి వచ్చిన జనసేన మరో నాయకుడి అరాచకాలు..! కన్న కూతుర్లకు వేధింపులు..!

ఆంధ్రప్రదేశ్లో జనసేన మరో నాయకుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి భార్య ఆత్మహత్యకు కారణమనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అంతేకాకుండా కన్న కూతుర్లపై వేధింపులకు పాల్పడ్డాడని కేసులు కూడా నమోదయినట్లు సమాచారం. భార్యను చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యకు ప్రేరేపించి, ఇద్దరు కన్న బిడ్డలను వదిలేసిన జనసేన నాయకుడు. జనసేన పార్టీ మత్స్యకార నాయకుడు మల్లాడి రాజు అధికార బలాన్ని, రాజకీయ అండదండలను అడ్డం పెట్టుకుని తన మొదటి భార్యను చిత్రహింసలకు గురిచేసి, ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణ ఉంది. తండ్రిగా అండగా ఉండాల్సిన తన ఇద్దరు ఆడపిల్లలను వేధిస్తూ, వారిపైనే పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టి రాజు వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరు ఆడపిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని, పదవిని అడ్డం పెట్టుకుని సొంత బిడ్డలనే వేధిస్తున్న మల్లాడి రాజుపై తక్షణమే పార్టీ పరంగా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ జోక్యం చేసుకొని, పార్టీ పరంగా రాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story