వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), భారతీయ జనతా పార్టీలు(BJP) తెగ విమర్శలు చేశాయి.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), భారతీయ జనతా పార్టీలు(BJP) తెగ విమర్శలు చేశాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల(Debt) కుప్పగా మార్చేశారని మండిపడ్డాయి. ఒకరేమో 11 లక్షల కోట్ల రూపాయల అప్పు అని చెప్పారు. మరొకరు 12 లక్షల కోట్లు అన్నారు. ఇంకొకరు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పారు. ఇలా రోజుకో అంకె చెబుతూ రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు పెట్టారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌(nirmala sitaraman) క్లారిటీ ఇచ్చినప్పటికీ చంద్రబాబు(Chandrababu) అండ్‌ కో మాత్రం పదే పదే అప్పులపై అబద్ధాలు చెబుతూ వచ్చారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం అసలైన అప్పు ఎంతో చెప్పింది. రాష్ట్ర అప్పు 6 లక్షల 46 వేల కోట్ల రూపాయలు అని స్పష్టం చేసింది. ఎక్కడి 14 లక్షల కోట్లు? ఎక్కడ ఆరున్నర లక్షల కోట్లు? మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి(Buggana Rajendranath reddy) ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ బడ్జెట్‌లో అంకెల గారడిని అర్థమయ్యేట్టుగా వివరించారు. ఇప్పుడు అప్పు గురించి కూటమి నేతలు ఏం చెబుతారో చూడాలి!

Updated On
Eha Tv

Eha Tv

Next Story