ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనుంది. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ఇకపై తెలుగు-ఇంగ్లీషులో ఉంటుంది. సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ ఈ సిలబస్‌పై దృష్టి పెట్టింది. NCERT సిలబస్ వల్ల మాథ్స్, కెమిస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సిలబస్ బాగా తగ్గుతుంది. ఇంటర్‌లో ప్రతి సబ్జెక్టుకు ఇకపై 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తీసుకొని ముందుకు వెళ్తామని అధికారులు తెలిపారు. జనవరి 26 వరకు వెబ్‌సైట్‌లో తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డ్‌లో సంస్కరణలు జరగలేదు. గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరగలేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృత్తిక శుక్లా తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story