ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు సిటీ సివిల్‌ కోర్టు సమన్లు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు సిటీ సివిల్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరిలో అయోధ్య రామాలయానికి పంపిన తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వాడినట్టు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. తిరుమల నుంచి అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలు కల్తీ నెయ్యితోనే తయారు చేశారని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటిషన్‌ దాఖలు చేశారు. పవన్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి సిటీ సివిల్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.రేణుక నోటీసులు జారీ చేశారు. నవంబర్ 22వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారిని ఆదేశించిన కోర్టు. మరోవైపు తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, వెబ్‍సైట్లు, యూట్యూబ్ చానెళ్ల నుంచి తొలగించేలా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ ఇమ్మనేని రామారావు కోర్టును కోరారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story