నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రేపల్లెలో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రేపల్లెలో పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయన విజయవాడ ఏరియల్ సర్వే కూడా రద్దయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా బాధితులందరినీ ఆదుకునేందుకు సమగ్ర ఏర్పాట్లు చేశామని, ప్రతి బాధిత వ్యక్తికి సాయం అందే వరకు కలెక్టరేట్‌లోనే ఉంటానని సీఎం హామీ ఇచ్చారు.
విజయవాడ నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్రం నుండి సహాయం కోరుతూ తాను ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుత విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, మరో రెండు రోజుల్లో కేంద్రానికి సవివరమైన లేఖ పంపుతామని ఏపీ సీఎం హామీ ఇచ్చారు.


Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story