United we stand, divided we fall అంటూ పవన్‌ కల్యాణ్ ట్వీట్ చేశారు.

United we stand, divided we fall అంటూ పవన్‌ కల్యాణ్ ట్వీట్ చేశారు. 'ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా కనీసం రెండున్నర దశాబ్దాల పాటు రాజకీయ స్థిరత్వం అవసరం. మనం కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోతే సాదించలేం. 21 వ శతాబ్దంలో కూడా నా కులం, నా వర్గం అంటే కష్టం. విభేదాలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. ప్రతీ ఒక్కరూ అర్దం చేసుకుని విభేదాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఓ వర్గం వాదన. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి పవన్, అల్లు అర్జున్‌కు మధ్య గ్యాప్ ఏర్పడిందని.. వారి అభిమానులుకు మధ్య సోషల్‌ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. అల్లు అర్జున్‌కు వైసీపీ సోషల్ మీడియా, నేతలు మద్దతుగా నిలిచారు. పవన్‌కు ఆయన అభిమానులు, జనసైనికులు, కూటమి నేతలు మద్దతుగా నిలిచారు. ఇంటర్నల్‌గా వాళ్లు ఎలా ఉన్నప్పటికీ వారి అభిమానులు మాత్రం క్షేత్ర స్థాయిలో యుద్ధానికే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కలిసుంటే నిలుస్తామని.. విడిపోతే పడిపోతామన్న అర్థం వచ్చేలా పవన్ ట్వీట్ చేయడంపై చర్చనీయాంశమైంది.

Updated On
ehatv

ehatv

Next Story