ప్రతీసారి మాలాంటి వాళ్లు వచ్చిన ఆపితేగానీ.. ఇలాంటి అక్రమ రవాణా(Illegal transport) ఆపలేరా

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు(Pawan kalyan) కోపం వచ్చేసింది. ఆ కోపంతో ఎమ్మెల్యే కొండబాబుతో(MLA Konda babu) వాగ్వాదానికి దిగారు. అధికారులపై కూడా సీరియస్‌ అయ్యారు. అసలేం జరిగిందంటే శుక్రవారం ఉదయం కాకినాడ పోర్టులో(Kakinada port) పవన్‌ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పైర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కూడా అక్కడున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని(Ration rice) ఆయన పరిశీలించారు. రేషన్‌ బియ్యం విషయంలో కాంప్రమై్‌ అయ్యారా అంటూ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)ను నిలదీశారు. ఇంత పెద్ద ఎత్తున బియ్యం దేశం దాటి వెళుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ప్రతీసారి మాలాంటి వాళ్లు వచ్చిన ఆపితేగానీ.. ఇలాంటి అక్రమ రవాణా(Illegal transport) ఆపలేరా అంటూ చురకలు అంటించారు. మీరు సరిగా ఉంటే పోర్టులోకి రేషన్‌ బియ్యం ఎలా వస్తాయి? అంటూ ఆయన అధికారులపై మండిపడ్డారు. పాపం కొండబాబు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు కానీ పవన్‌ వింటేగా! ఇది జరిగిన కాసేపటికే కొండబాబుపై పవన్‌ మరోసారి కోపగించుకున్నారు. ఈసారి టగ్గులో వెళుతూ ఆయనపై మండిపడ్డారు. బిజినెస్ అంటే స్మగ్లర్ ను అనుమతించడం కాదు కదా అనడంతో కొండబాబు బిత్తరపోయారు. మనం ఏమీ చెయ్యకపోతే రేషన్ మాఫియాలో మన హస్తం ఉన్నట్లు ఉంటుందని పవన్‌ అన్నారు. రేషన్ బియ్యంపై విజిలెన్స్ ఎంక్వెయిరీ జరుగుతోందని కొండబాబు చెప్పే ప్రయత్నం చేసినా ఆ మాటలు పవన్‌ పట్టించుకోలేదు. పైగా కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై హోం మంత్రికి, పీఎంవోలకు లేఖ రాస్తానని పవన్‌ హెచ్చరించారు.

రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక దగ్గరకు పవన్‌ సముద్రంలో ప్రత్యేక బోట్ లో వెళ్లి పరిశీలించారు. సముద్రం నుంచి పోర్టుకు చేరుకున్న తర్వాత ఎస్పీ ఎందుకు కనిపించడం లేదని అడిగారు. తాను వచ్చే సమయానికి ఎందుకు సెలవు తీసుకున్నారని ప్రశ్నిస్తూ ఇదంతా చాలా బాగుంది అని పవన్‌ కామెంట్ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story