ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందనం(thaliki vandanam) పథకం కోసం విధి విధానాలను ఖరారు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందనం(thaliki vandanam) పథకం కోసం విధి విధానాలను ఖరారు చేశారు. ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్ధిక సాయం, విద్యార్థులకు కిట్స్‌ పంపిణీ చేస్తారు. అయితే తల్లికి వందనం, విద్యార్థుల కిట్స్‌ పథకాలను ఆధార్‌(Aadhaar Card) తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ స్పష్టం(Education Department) చేసింది. కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలని లేనిపక్షంలో ఆధార్‌ కార్డు కోసం నమోదు చేసుకుని ఉండాలని అధికారులు చెప్పారు. ఆధార్‌కార్డు వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫోటో ఉన్న బ్యాంక్‌ లేదా పోస్టాఫీసు పాస్‌బుక్‌, పాన్‌ కార్డు, రేషన్ కార్డు, ఓటర్‌ ఐడెంటిటీ కార్డు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కార్డు, ఫోటో ఉన్న కిసాన్‌ కార్డు, గెజిటెడ్‌ ఆఫీసర్‌ లేదా తహసీల్దార్‌ ఆఫిషియల్‌ లెటర్‌ హెడ్‌, ఏదైనా డిపార్ట్‌మెంట్‌ డాక్యుమెంట్‌లలో ఏదో ఒకటి ఉండాలని స్పష్టం చేసింది. విద్యార్థులకు ఇచ్చే కిట్‌లో బ్యాగు, బెల్ట్‌, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్‌ ఇస్తారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story