అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశంపార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి మేనిఫెస్టోలో(Manifesto) ఎన్నో అంశాలను పెట్టింది.

అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశంపార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి మేనిఫెస్టోలో(Manifesto) ఎన్నో అంశాలను పెట్టింది. ఇందులో బీజేపీ(BJP) పాత్ర పెద్దగా లేదు కానీ హామీల విషయంలో టీడీపీ, జనసేన(Janasena) కూడబలుక్కుని కొండంత హామీలను గుప్పించాయి. మహాశక్తి పథకం(Maha Shakthi Scheme) కింద మహిళలకు ఆర్ధికసాయం చేస్తామని చెప్పాయి. కానీ ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో(AP Budget) ఆ పథకం ఊసే లేకుండా పోయింది. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చంద్రబాబు(Chandrababu) హామీ ఇచ్చారు. ఎన్నికల సభలలో పదే పదే చెబుతూ వచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చంద్రబాబు వాగ్దానం చేశారు. అయితే ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహిళలకు ఏడాదికి రూ. 18,000 ఆర్థిక సాయం ఉసేత్తకపోవటం గమనార్హం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story