ఏపీలో తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీలో తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరును ప్రోత్సహించడమే లక్ష్యంగా, ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే కనీసం 75 శాతం హాజరు ఉండాలని షరతు విధించింది.

ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు ₹15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు.ప్రస్తుతం ప్రభుత్వం రెండు ఆప్షన్లపై అధికారులతో చర్చిస్తోంది.మొత్తం ఒక్కసారిగా ₹15,000 జమ చేయాలా? లేదా రూ.7,500 చొప్పున రెండు విడతలుగా జమ చేయాలా అన్నదానిపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు.

ప్రతి విద్యార్థి కనీసం 75 శాతం హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.హాజరు లక్ష్యం చేరని విద్యార్థుల తల్లులకు ఈ పథకం ప్రయోజనాలు వర్తించబోవని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ విధానంతో విద్యార్థుల హాజరును పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.

ఏపీలో 'తల్లికి వందనం' (Thalliki Vandhanam )పథకం అమలులో 75 శాతం హాజరు షరతు వల్ల విద్యార్థుల విద్యాప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story