AP Governor Justice Abdul Nazir : ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అస్వస్తతకు గురయ్యారు. సోమవారం కడుపునొప్పితో బాధపడుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ను తాడేపల్లి జాతీయ రహదారిలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు.

AP Governor Justice Abdul Nazir is ill
ఏపీ గవర్నర్(AP Governor) జస్టిస్ అబ్దుల్ నజీర్(Justice Abdul Nazir) అస్వస్తత(ILL)కు గురయ్యారు. సోమవారం కడుపునొప్పితో బాధపడుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ను తాడేపల్లి జాతీయ రహదారిలో ఉన్న మణిపాల్ ఆసుపత్రి(Manipal Hospital)కి తరలించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్(CM Jagan) ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోమవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురైన గవర్నర్ విజయవాడ(Vijayawada)లోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే తిరుమల పర్యటనలో ఉన్న సీఎం.. అధికారులతో మాట్లాడారు. గవర్నర్‌కు అపెండిసైటిస్ సర్జరీ(Appendicitis Surgery) జరిగిందని.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలియజేశారని సీఎంకు అధికారులు తెలిపారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
