ఏపీ హైకోర్టులో(AP high Court) ఓ ఆశ్చర్య సంఘటన చోటుచేసుకుంది.

ఏపీ హైకోర్టులో(AP high Court) ఓ ఆశ్చర్య సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ముందు నగ్నంగా విచారణకు(Nude appearence) హాజరుకావడం పట్ల జడ్జీకి ఆగ్రహం తెప్పించాడు. అందరూ చూస్తుండగానే ఒంటిపై బట్టలు లేకుండా జడ్జీ ముందుకు రావడం ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ అక్టోబర్ 15న హైకోర్టులో ఓ కేసు విచారణ జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన ఓ వ్యక్తి కేసు విచారణకు ఆన్ లైన్‌లో(Online hearing) హాజరయ్యాడు. కిట్టు అనే యూజర్‌ ఐడీతో యాప్‌ ద్వారా 17వ కోర్టు విచారణలోకి లాగిన్‌ అయ్యాడు.. అక్కడ ఆ వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా మంచంపై నగ్నంగా పడుకొని తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశాడు. అయితే మంచంపై నగ్నంగా పడుకుని ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యక్షం కావడాన్ని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా విఘాతం కలిగించాడంటూ ఆ వ్యక్తి చర్యలను తీవ్రంగా పరిగణించింది. వెంటనే కోర్టు సిబ్బందిని అప్రమత్తం చేసిన న్యాయస్థానం.. అతడి లాగిన్‌ బ్లాక్‌ చేశారు. హైకోర్టు ఐటీ రిజిస్ట్రార్‌ ఏడుకొండలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story