AP Inter Results : ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి.. బాలికలదే హవా..!
ఏపీ విద్యా శాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలు జరిగిన 22 రోజుల వ్యవధిలో పరీక్షా ఫలితాల విడుదల చేసి సరికొత్త రికార్డు నమోదుచేశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4,84,197 మంది విద్యార్ధులు హాజరుకాగా.. 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్‌కు 5,19,793 మంది విద్యార్థులు హాజరవగా..72 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.

Ap Inter Results Release By Botsa Satyanarayana
ఏపీ విద్యా శాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) బుధవారం ఇంటర్ ఫలితాలు(Inter Results) విడుదల చేశారు. పరీక్షలు జరిగిన 22 రోజుల వ్యవధిలో పరీక్షా ఫలితాల విడుదల చేసి సరికొత్త రికార్డు నమోదుచేశారు. ఇంటర్ ఫస్టియర్(Inter First Year) పరీక్షలకు 4,84,197 మంది విద్యార్ధులు హాజరుకాగా.. 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్(Inter Second Year)కు 5,19,793 మంది విద్యార్థులు హాజరవగా..72 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టీయర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా(Krishna) జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. 70 శాతం ఉత్తీర్ణతతో ప.గో(West Godavari) జిల్లా రెండో స్థానం, 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు(Guntur) జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి.
ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాల్లోనూ 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్ మొదటిస్థానం దక్కించుకుంది. 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా రెండవ, 77 శాతం ఉత్తీర్ణతతో ప.గో జిల్లా మూడవ స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షా ఫలితాల్లో బాలుర మీద బాలికలు పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలురు 58 శాతం, బాలికలు 65 శాతం ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో బాలురు 68 శాతం, బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్ధులకు ఫలితాలు http://examresults.ap.nic.in/ మరియు https://bie.ap.gov.in/ , https://bieap.apcfss.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి.
