సాధారణంగా మద్యం షాపులు(Wine shops) కిటకిటలాడుతుంటాయి.

సాధారణంగా మద్యం షాపులు(Wine shops) కిటకిటలాడుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులకు గిరాకీ లేకపోవడంత పలు ఆఫర్లు(Offers) ప్రకటిస్తున్నారు. మద్యం దుకాణాలు అధికంగా ఉన్నందున గిరాకీలు లేవంటున్నారు మద్యం షాపు నిర్వాహకులు. అయితే ఏపీలోని పలు మద్యం షాపుల నిర్వాహకులు మందుబాబులను ఆకట్టుకునేందుకు ఆఫర్లు ప్రకటించాయి. ప్రతీ మద్యం బాటిల్‌కు ఒక గుడ్డు(Egg), గ్లాస్(Glass), వాటర్‌ ప్యాకెట్(Water packet) ఉచితమని మద్యం షాపుల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అధిక షాపులు ఉండడం, గిరాకీ లేకపోవడంతో మార్కెటింగ్‌ కోసం ఆఫర్లు తప్పడం లేదని మద్యం షాపు యజమానులు చెప్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story