తెలుగుదేశంపార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై(Amaravati) ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారు.

తెలుగుదేశంపార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై(Amaravati) ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారు. 189 కిలోమీటర్ల పొడవున అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు(amaravati Outer ring road) ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి నడుం బిగించారు. గత ప్రభుత్వం అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును అసలు పట్టించుకోలేదని, ఆ ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయిందని అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ఔటర్‌ రింగ్‌ రోడ్డు పునరుద్దరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు రాజధాని అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తుందని పయ్యావుల కేశవ్‌ అన్నారు. హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డుతో పోలిస్తే అమరావతిలో నిర్మించబోతున్న ఔటర్‌ రింగురోడ్డే పొడవైనది!

Updated On
Eha Tv

Eha Tv

Next Story